శంకరా…నీ లీలలు అనంతం…
ఈశ్వరా…నీ ప్రేమ అమృతం…
నీ మహిమ శాశ్వతం….
నీ కరుణ అద్భుతం…
నీ స్మరణలే మాకు ఆనంద భరితం…
మా మదిన ఉప్పొంగు గంగ జలపాతం…!!శంకరా!!
అనితర సాధ్యమైన నీ రూపు కననుంటిని….
ఆదిమధ్యాంత రహితుడా నీ మొదలేదో తుది ఏదో తెలియలేకుంటిని….
అనంత విశ్వమున నిన్ను అర్చించ నుంటిని…
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా అర్చించ సరిపడా సుమములు సమకూర్చ లేకుంటిని….
స్వర పూజ చేసేను స్తోత్రములు పలుకుతూ….
సుస్వరముగ కీర్తింతు కీర్తనలు పాడుతూ….!!శంకరా!!
అపారమగు సంపదలు నీ దయా నిధులు….
ఉమా మహేశ్వరుడా…ఉత్తినే వరమిచ్చెవు లేవుగా నీ కరుణకు హద్దులు….
అసాధారణములు నీ ప్రేమ వీక్షణములు…
భ్రమరాంబికా పతీ అవి మమ్ము భ్రమ నుండి తప్పించు నీ పుణ్య కిరణములు….
కర్పూర హారతుల క్రతువు చేసేను…
నీవు వరమిస్తే వేలాది కృతులు వ్రాసేను….!!శంకరా!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్షమాం…రక్షమాం..