హరుడనుచు కొలవనా…
శ్రీహరీ యనుచు పిలవనా…
ఏకమై పోయారు ఒకరిలో ఒకరు…
మమైక పోయేరు భక్తులతో ఇద్దరూ…
ఈశ్వరా… నీ పాదాల పూలుంచనా…
ఓ కేశవా…నా మనసునర్పించనా…
కంటిమని హరిహరులను ఒక్కచోట…
మురిసి చెప్పుకోరా భక్తులిక పూట పూట…
వింటిరని ప్రార్థనలు మా నోటి వెంట…
సంతసమున పంచుకోరా అందరికి తీపి వంట…
ఓ మాధవా…మల్లన్న లింగమున అమరిపోయావు…
హే కేశవా…ఆ కారుణ్యమూర్తి లో ఒదిగి పోయావు…!!హరి!!
ఎంత భాగ్యమో కదా భక్తులకు నేడు…
మిమ్ములను కనిన ప్రతి ఒకరి కలలు పండు…
ఇంకెంత ధన్యమో కదా మా జీవితాలు…
తిరుగాడనేల మేమింక పుణ్య క్షేత్రాలు…
పద్మనాభా…కరుణించి తెరవవా కమల నయనాలు…
గౌరీ మనోహరా…దీవించి ఇవ్వవా తీర్థ ప్రసాదాలు…!!హ!!
పాహిమాం…పాహిమాం… పార్వతీశా పాహిమాం…రక్షమాం..రక్ష మాం…రమా సహిత సత్యనారాయణ రక్షమాం…