నీ దారి పట్టాను శంకరా…
ఇక ఏదారి నా కొలదు ఈశ్వరా…
తలచు కుంటూ బ్రతికేను గంగాధరా…
నీ వైపు నను మలచుకోమంటి శంభోహరా….
వీడకుండా నేను నీ చరణ కమలములు…
ఉండనీవా నన్ను ఏడేడు జన్మలు….!!నీ!!
క్షణము కొకసారి గురుతుకొస్తుంటవు…
ఘడియ కొకసారైనా పలకరిస్తుంటవు…
పగలనక రేయనక కాపాడుతుంటవు…
దిగులుగా నేనుంటే భుజము తడుతుంటవు…
ఇక పట్టకుండా ఉంటునా నీ దారిని…
శివా…చేపట్టకుండా ఉంటునా నీ దీక్షని…!!నీ దారి!!
తిష్ట వేశావేమో నా మనసులో…
అందుకే ఇష్టమైపోయావు ఆ క్షణములో…
కలయ తిరిగేవేమో గుండెలో…
అందుకే బ్రతికి వున్నానయ్య పుడమిలో…
ఇంతలా వశమైతే నా ప్రాణము..
శివా…చేయదా ఈ జన్మ నీ ధ్యానము…!!నీ దారి!!
పాహిమాం..పాహిమాం..పరమేశ్వర పాహిమాం..రక్ష మాం..రక్షమాం..గంగాధర రక్షమాం..