పార్వతీ పతీ ఒకసారి పరికించరా…
గౌరీ పతీ కనులారా తిలకించరా…
కమల పుష్పాలతో నిలిచాము నీ ముందర….
ఆనంద బాష్పాలు రాల్చుతూ శివ శంకరా…
ఆనతిస్తే ఉంచేము పాదాల చెంత…
నీవు సమయమిస్తే తెలిపేము మా వేదనంతా…!! పా!!
రెండక్షరాలే అయిననూ శివ శివా అను పిలుపు…
మనసార తలిచితే అవి మమ్ము నీలోన కలుపు…
అడ్డ నామాలు మూడున్న మా నుదుటిన…
గడ్డు కాలాలు భయపడును శశిభూషణా…
నీ నామ స్మరణలో ఉంది ఆ మహిమ…
నీ విభూది రేఖలే మా రక్ష జంగమ…!!పా!!
ఆర్ద్రతతో పిలిచితే పలికేవు నీవు…
దయార్ద్ర హృదయునివై మొర విందువు…
విలపించితే చాలు కరిగేవు నీవు…
చింతించవలదనుచు ఓదార్చెదవు నీవు…
అపర దయామయునివయ్య శివ శంకరా…
సకల పాపముల హరియించు గంగాధరా….!!పా!!
పాహిమాం…పాహిమాం..శివశంకరరా..