వీరభద్రా విన్నపం..

వీరభద్రా విన్నపం…
చాలించు తండ్రీ నీ ఉగ్ర రూపం…
ప్రళయ రుద్రా వందనం…
చూడనీ తండ్రీ నీ కరుణ వదనం…
పాప కర్మల ఊబిలో పడి ఉన్నవారము….
ప్రసన్నముగ కనిపిస్తే బయట పడనున్నవారము…!!వీ!!

అల్లకల్లోల మయ్యేను సప్త సంద్రాలు…
కళా విహీనమయ్యేను కొండ కోనల్లు….
కాలి బూడిదై పోయేను వృక్ష సంపదలు….
పుడమి చీలేను నిలువుగా రెండు భాగాలు….
ఫణిభూషణా… ప్రస్తుతింతుము నిన్ను వేదనా భరితముగా…
నంది వాహనా…ప్రత్యక్షమవుమయ్య ప్రసన్నముగ నీవు శీఘ్రముగా…!!వీ!!

తట్టుకోగలమా నీవు ఆగ్రహిస్తే…
బ్రతికుండగలవారమా నీవు తీవ్రముగా చూస్తే…
ముట్టుకోగలమా పాదాలు ఉగ్రముగ చూస్తే…
కడకు చేయగలమా పూజలను చిన చూపు చూస్తే…
హే శంకరా…నీ చరణాల సాక్షిగా నిను నమ్మి వుంటిమి….
హే మహేశ్వరా…తప్పులను మన్నించి ప్రసన్నముగ కనిపించమంటిమి…!!వీ!!

పాహిమాం…పాహిమాం… అని చరణాల పడితిమి….
రక్ష మాం..రక్ష మాం.. అనుచు దయ చూడు మంటిమి…

Leave a Comment

Scroll to Top