విశ్వమోహనాకార విశ్వేశ్వరా…

విశ్వమోహనాకార విశ్వేశ్వరా…
నయనానందకార నాగేశ్వరా…
మూడు కన్నుల శివా ముక్తేశ్వరా…
సర్వ భక్త ప్రియా సర్వేశ్వరా…
ప్రభాత పూజలను అందుకొనుమా…
సుప్రభాత సేవలను పుచ్చుకొనుమా…!!వి!!

ప్రారంభమౌ నీ దయతోడ ప్రతి ఉదయము…
శుభారంభమౌ భువనమున జన జీవనం…
కదిలిస్తూ కాలాన్ని కరుణ చూపేవు…
నడిపిస్తు బ్రతుకులను ఒడ్డు చేర్చేవు…
కష్టసుఖములు మాకు తెలియజేసేవు….
కష్టాలు కనుమరుగుకాకున్న కనికరించేవు…!!వి!!

పోరాటమే ప్రతి రోజు మా జీవితం…
నీపైన ఆరాటమే లేని మా జన్మ వేదనాభరితం…
సంక్లిష్టమే సలుప సంసార బంధం…
సంతృప్తి లేకుంది జీవించినా ఏ జన్మదో పాపం…
ప్రతి రోజు ప్రార్ధించుటే మా మొదటి ధ్యేయం…
నీ దయను పొందుతూ బ్రతుకుటే మాకు ఏకైక లక్ష్యం…!! వి!!

పాహిమాం…పాహిమాం..పరమేశ్వరా పాహిమాం…రక్షమాం…రక్షమాం..సర్వేశ్వరా రక్షమాం…

Leave a Comment

Scroll to Top