చెప్పు… ఏదో ఒకటి చెప్పు…
మౌనముగా ఉండకు శివ శంకరా…
తప్పు… నేను చేసిన తప్పు…
నిను మరుచటన్నది గంగాధర…
ఇపుడిపుడె తెరిచాను నా కన్నులు…
నాకు ఇపుడిపుడె తెలిశాయి నీ మహిమలు…!!చెప్పు!!
ధారపోస్తాను నా ఊపిరంతా….
దారి చూపయ్య చేర నీచెంత…
హారతిస్తాను నా బ్రతుకునంతా…
హర హరా..దయ చూపు నా పైన కొంత…
మన్నించడం నీకు కొత్త కాదు…
కరుణించక ఉండడం నీకు చేతకాదు…!! చె!!
బిల్వార్చన చేసేను భక్తి కలిగించు…
అభిషేకములు చేసేను ఆర్తి కలిగించు….
ధ్యానించుచున్నపుడు నాకు కనిపించు….
జన్మ కడవరకు నీ వేలుతో నన్ను నడిపించు…
మరిచానని నిన్ను నాపైన అలగకు…
శివా…తప్పు చేశానని దీవించకుండా ఉండమాకు…!! చె!!
పాహిమాం పాహిమాం పరమేశ్వర పాహిమాం… రక్ష మాం…రక్ష మాం..సర్వేశ్వరా..రక్షమాం…