శివుడాయే గోపడు…
మన హరుడాయే చిన్ని కృష్ణుడు…
ఈశ్వరా… తలచుకుంటివా నందగోపాలుని…
నుదుట నుంచుకుంటివా చిన్ని కన్నయ్యని..!!శి!!
నెమలి పింఛము నీకు అందమాయే…
చిన్ని దరహాసమున నిను చూడముచ్చటాయే….
నవనీత పూజలు నీకు వేడుకాయే…
వెన్న ముద్దల గిరులు నైవేద్యమాయే…
దర్శనంబిచ్చావు పురుషోత్తమునిగా….
దీవించ వచ్చావు దేవకీ సుతునిగా…!!శి!!
ధర్మబద్ధుడతడు మధుసూదనుండు….
మోహనాంగుడతడు యదు నందనుండు…
ప్రేమ పంచీ జయించు ఎవరినైనా….
తన మురళీ రవములకు పడు వారే ఎవ్వరైనా….
గోవర్ధనగిరి నెత్తి గోవులను కాచిన…
నల్లనయ్యా… రక్షించు భక్తులను చప్పున…!!శి!!
పాహిమాం పాహిమాం మధుసూదనా పాహిమాం… రక్షమాం రక్షమాం సర్వేశ్వర రక్షమాం…