వినిపించుకోవా వేదనా…

వినిపించుకోవా వేదనా…
నా మనసు చేసే రోదన…
వినగరావు కష్ట సుఖములు…
తొలగనివ్వవు కర్మ ఫలములు….
శివా…ఇది నేను చేసిన పాపమా..
గత జన్మ కర్మల ఫలితమా…!!వి!!

నేల కొరిగిన కొమ్మనై…
ఒక తీగ తెగినా వీణనై…
రాలిపోయిన పువ్వునై…
ఒక రెక్క విరిగిన పక్షినై…
చుక్కాని లేని పడవలోన సాగుతున్నది పయనము ..
శివా…దిక్కు నీవని మొక్కుతుంటే చేర్చవే కైలాసము…!!వి!!

మనసులో నిను నిలిపితి…
కలనందు కూడా కొలిచితి…
నిత్యమూ నిను తలచితి…
అనునిత్యమూ స్మరియించితి…
ఏ కర్మ ఫలమో కక్ష గట్టి వెంటాడుచున్నది నేటికీ…
నువు కరుణ చూపి చేయి నిస్తే నిను మరువరా ఏ నాటికీ…!!వి!!

పాహిమాం…పాహిమాం..పరమేశ్వరా పాహిమాం…రక్షమాం…రక్షమామ్..సర్వేశ్వరా రక్ష మాం…

Leave a Comment

Scroll to Top