అలుపెరుగవా నీవు ఆదిదేవా…

అలుపెరుగవా నీవు ఆదిదేవా…
దీవెనలు ఇస్తూనే వుంటావు భువి జనులకు…
శయనించవా నీవు మహాదేవా…
రేపవలు స్పందిస్తు వుంటావు మా పిలుపుకు…
శివా…శిరమొంచి మొక్కేము నీ కరుణకి…
హరా…పూజలను చేసేము నీ రూపుకి…!!అలు!!

చూస్తూనే వుంటావు మా బాగోగులు….
శివా…మాకెందుకుంటుంది ఇంక దిగులు…
కాపాడుతుంటావు వేలసార్లు…
సేవించ పుట్టాలనుంటుంది మాకు లక్ష సార్లు…
అసమాన తేజో విరాజితుడివి నీవు…
శివా…విశ్రమించుటన్నది నీవు ఎన్నడెరిగేవు….!!అలు!!

మళ్లించు కుంటూనే నీ వైపుకి…
మొక్కులను గైకొనుచు ఉంటావు మా మంచికి…
రప్పించు కుంటూనే నీ గుడులకి…
శివా…అతి దగ్గరవుతావు మా మనసుకి…
మంత్రాలతో నిను మేము మెప్పించకున్నా..
నీ మాయ లోయలలో పడవేతువు నిజము శివన్నా…!! అలు!!

పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్ష మాం..రక్ష మాం..సర్వేశ్వరా రక్ష మాం…

Leave a Comment

Scroll to Top