ప్రమద గణనాయకా వందనాలు…

ప్రమద గణనాయకా వందనాలు…
కరుణ గుణదాయకా అభివందనాలు…
గౌరి తనయా నీకు వేల దండాలు…
తొలగించరా అడ్డున్న విఘ్న శిఖరాలు…!!ప్ర!!

శంకరుడు వరమియ్య బట్టి…
దైవమయ్యావు లోకాలు కొలవ బట్టి…
హిమపుత్రి గారాల పట్టీ…
వండి తెచ్ఛాము కుడుములను మనసు పెట్టి…
ఇక అందుకో నైవేద్యములు విఘ్నరాజా….
నువ్వాదుకో భక్తులను సూర్యతేజా…!!ప్ర!!

ముచ్చట వును నిను కనిన వక్రతుండ…
మమ్ము చల్లంగ చూసేవు నీ కడుపు సల్లగుండ…
ఉండగలమా నిను మేము కొలవకుండా…
మొదలెట్టగలమా ఏదేని నీ పూజ చేయకుండా…
పెద్దలకు,పిల్లలకు స్నేహితుడవు నీవు….
మాకు శుభములను కలిగించు దేవుడవు నీవు….!!ప్ర!!

పాహిమాం…పాహిమాం…పార్వతి తనయా పాహిమాం…రక్ష మాం..రక్షమాం…షణ్ముఖ సోదరా రక్ష మాం…

Leave a Comment

Scroll to Top