జన్మ నిచ్చిన జంబుకేశ్వరుడా…
మనసునిచ్చిన మల్లికార్జునుడా…
చూపు నిచ్చిన చంద్రశేఖరుడా…
భక్తి పెంచుము నీపైన భీమ శంకరుడా…
శివ శివా శంకరా…శివ శంకరా…
హర హరా భవహరా…గౌరీవరా…!!జ!!
విశిష్ట పూజలను నను చేయనీ…
నీ సంక్లిష్ట స్తోత్రాలు నను పలుకనీ…
ఉత్కృష్ట సేవలను నను చేయనీ…
గరిష్ఠముగ పుణ్యములు నను పొందనీ…
లింగాకృతిగా వెలసినా ఈ భువనమందు…
శివా…నీ పూర్ణాకృతిగ వెలిశావు మా మనసులందు…!!జ!!
ఓంకార రూపం మా ప్రాణ దీపం…
నీ ప్రణవ నాదం…మా జీవ వేదం…
వినిపించు చుంటుంది విశ్వమంతా…
ప్రకంపనలు సృష్టిస్తు వుంటుంది లోకమంతా…
ఆ ప్రకంపనలే సృష్టి ప్రాణ వాయువుగా…
బ్రతుకుచుంటిమి శివా…నీ దయా భిక్షగా…!!జ!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్ష మాం..రక్ష మాం..సర్వేశ్వరా రక్ష మాం…