లోకసంరక్షకా శివశంకరా….
భక్త జన పాలకా అభయంకరా…
దీన జన బాంధవా కరుణాకరా…
వేడుకొన వరమిచ్చి ఆదుకొనరా…!!లో!!
దీపమవుతును నేను నీ పూజకు…
ధూప హారతవుతును నేను నీ సేవకు…
మాల నవుతును నేను నీ ప్రతిమకు…
స్తోత్రమాలనవుతును నేను నీ స్తుతులకు…
ఈశా… పాశాలు నన్నెంత పీడించినా…
మహేశా….ఈ జన్మ నిను మరచి మనగలుగునా…!!లో!!
దాహార్తి నవ్వాలి నీ ధ్యానమునకు…
శరణార్తి నవ్వాలి నీ కరుణ కొరకు…
స్వరము నవ్వాలి నేను నీ గానమునకు…
సాహిత్యమవ్వాలి నీ గీతమునకు…
శంకరా…ఈ సామాన్య మానవుడిని కరుణించవయ్యా….
ఈశ్వరా…అసమాన భక్తుడిగా నను చేయవయ్యా….!!లో!!
పాహిమాం…పాహిమాం..పరమేశ్వరా పాహిమాం…రక్ష మాం…రక్ష మాం…సర్వేశ్వరా రక్ష మాం…