ఈశా..నీ అంశయే కదా ఆ వీర హనుమా…
పరమేశా…అణువంత చూపుమా మాపైన అట్లాంటి ప్రేమ…
తరియించెదము శంకరా నీ సేవ చేసి….
ప్రస్తుతించెదము శంకరా.. నీ రూపు చూసి…!! ఈశా!!
అసమాన వీరుడు ఆ ఆంజనేయుడు….
నీ దయవల్ల తానయ్యే మహనీయుడు…
రామ నామము తలచి పుణ్యాత్ముడయ్యే…
తన సేవలో మురిసి అపరధన్యాత్ముడయ్యే…!! ఈశా!!
వాయునందునిగా పేరుగాంచాడు…
వాయువేగమున ఆ లంక చేరాడు…
రావణాసురుని చెరలోని జానకిని చూసి…
కన్నీటిపాలయ్యే సీతమ్మ వేదనను చూసి…
రామచంద్రుని గురుతు ఆ తల్లికిచ్చి…
చిరంజీవిగా వరమొందె సీతమ్మ మనసు గెలిచి…!!ఈశా!!
పాహిమాం పాహిమాం పరమేశ్వర రక్షమామ్ రక్షమాం సర్వేశ్వర…