షణ్ముఖ సోదరుడే…

షణ్ముఖ సోదరుడే…
గణపతి విఘ్న వినాయకుడే…
పార్వతి  నందనుడే….
గణపతి శివ వరదాయకుడే…
కొలిచిన కొలది వరముల నిచ్చే హితుడే గణపతిలే…
నువ్వు కోరినవన్నీ కాదనకిచ్చే స్నేహితుడే గణపతిలే…!! ష!!

లంబోదరుడైనందున..
మన బాధల బరువులు మోయునులే…
తను అంబాసుతుడైనందున…
మన గాథలు ప్రియముగా వినునులే…
తెలిపిన కొలదీ వెతలను తీర్చే గుణమే గణపతిది….
మన కార్యములన్నీ ఒడ్డుకు చేర్చే సద్గుణమే గణపతిది…!! ష!!

ఈశుని ఆనతిమేర…
గజ శిరమును పొందిన ధీరుడు…
ఆ పార్వతి కోరిక మేర…
తానయ్యను పూజలకర్హుడు….
ఇలలోనైనా దివిలోనైనా మొదటి పూజలు గణపతికే…
తల పెట్టిన పనులకు విజయం కూర్చే ఘనతలు గణపతికే..!! ష!!

పాహిమాం పాహిమాం గణపతి నాథ పాహిమాం.. రక్షమాం రక్షమాం… సిద్ధివినాయక రక్షమాం…

Leave a Comment

Scroll to Top