చాలయ్య శంకరా… ఓ నగవు చాలు…
ఆ నగవులే మాకు పంచప్రాణాలు…
నిజమయ్య ఈశ్వరా నిజము నిజము…
ఆ నగుమోము కనిన ప్రతి జన్మ పరమ పావనము…
కైలాస వాసా…కారుణ్య మూర్తీ…
తిలకించరా శివా…మా కనుల ఆర్తి…!!చా!!
నిజమౌను మా కలలు నిను గాంచిన…
ఋజువౌను ఏ క్షణము మనసార తలచిన…
స్పందించు మది నీది శివశంకర…
వరములందించు హృది నీది పరమేశ్వరా….!!చా!!
ఏకాగ్రతనిస్తివో ఏకాంబరేశా..
కనుల కొలువుండ కోరేను కాళహస్తీశా..
అనుగ్రహమును ఇస్తివా పార్వతీశా…
అనుదినము సేవింతు శాంకరీశా…
నా ప్రార్థనలకు నీ మనసు పరవశించేలా…
ఉప్పొంగి నేనడుగు వరములిచ్చేలా…!!చా!!
పాహిమాం…పాహిమాం… పరమేశ్వర పాహిమాం.. రక్షమాం రక్షమాం సర్వేశ్వరా రక్షమాం…