ఏ వరము లింకెందుకు…

ఏ వరము లింకెందుకు…
శంకరా.. నిను కనిన ఈ జన్మకు…
ఏ సిరులు మాకెందుకు…
ఈశ్వరా…నీ కరుణ ఉన్నందుకు…
ఎనలేని సౌందర్యమున
జగమేలు చుంటివి…
మా మదిన నివసించి మమ్మేలుచుంటివి…!!ఏ!!

పావనమైనది నీ పాదం…
అది కడిగిన తొలగును మా పాపం..
అద్భుతమైనది నీ రూపం….
నిను గాంచిన జన్మకు కడుపుణ్యం…
శివ శివ శివ యని మేమనుచుంటే…
నువ్వు ఉంటావయ్యా మా వెంటే..!!ఏ!!

త్రిశూలధారివై అడుగేస్తుంటే……
జయ జయహో సురులని అంటుంటే…
ఆ గగనము ఛత్రము పడుతుంటే…
నలు దిక్కులు శరణని అంటుంటే…
నీ పూజకు తారలు పువ్వులు కావా…
మా జన్మలు నీకిక హారతి కావా…!!ఏ!!

శంభో శంకర మహదేవ…హే గంగాధర శివ గురుదేవ…
ఓం నమో నమో శివ శంకరా… నిను వినా దిక్కు మాకు ఎవరు రా..

Leave a Comment

Scroll to Top