చీకట్లు తొలగించు భద్రకాళి…

చీకట్లు తొలగించు భద్రకాళి…
తొలగించి మా చేత చేయించు దీపావళి…
ముత్యాలముక్కెరను సమర్పింతుమమ్మా…..
చక్కని మా తల్లి దీవించుమమ్మా…!!చీ!!

పడనివ్వవే నా తల్లి నీ చూపును..
పడమిస్తే నేనౌత నీ బిడ్డను…
రానివ్వవే నీ గుడికి ఎప్పుడైననూ…
రానిస్తే నేనౌత నీ పూజ సుమమును…
బంగారు నా తల్లి వెలిగింతు దీపము…
అందాల నా తల్లి కొలువుంచు నా కనుల నీ దివ్య రూపము…!!చీ!!

జగదేక సుందరివి హే జగన్మాత…
నీవు మహిమాన్విత మంజరివి లోకమాత…
దుష్టులను శిక్షించి లోకాలు కాచేవు…
భక్తులను రక్షించి నీ మహిమ చూపేవు…
విశాల హృదయము గల ఓ విశాలాక్షి….
నీ విజయాల గురుతుగా  చేయు  పండగే తల్లి నీకు సాక్షి…!!చీ!!

పాహిమాం పాహిమాం పరమేశ్వరి… రక్షమాం రక్షమాం.. సర్వేశ్వరీ…

Leave a Comment

Scroll to Top