పల్లవి:
వచ్చెరా వచ్చెరా శంకరుడు వచ్చెరా…
ఇచ్చురా ఇచ్చురా వరములను ఇచ్చురా…
మొక్కరా మొక్కరా ఈశ్వరుని బిర బిరా…
మెచ్చురా మెచ్చురా సాంబడు నిను మెచ్చురా…
శివా శివా సాంబశివా..శంభో హర శంకర…
హరా హరా సదా శివా..గంగాధర ఈశ్వరా…!!వ!!
చరణం:
వెన్నపూస లాంటిదిరా శంకరుని మానసం…
మల్లె మొగ్గ లాంటిదిరా ఈశ్వరుని హృదయము…
ఒక్కసారి విన్నవిస్తే తీరును నీ కష్టము…
నువ్వు మనసారా “శివా” అంటే తనకెంతో ఇష్టము…
శివా శివా సాంబశివ శంభో హర శంకర…
హరా హరా సదా శివా గంగాధర ఈశ్వరా…!!వ!!
చరణం:
సదా ప్రేమ చూపేను శంకరుడు భక్తులపై…
“హరా” అనుచు పిలవగానే అరుదెంచును నందిపై…
వెనుక ముందు చూడడంట విశాలాక్షి విభుడు…
నిన్ను కాపాడక వుండడంట కాత్యాయనీ సఖుడు….
శివా శివా సాంబశివ శంభో హర శంకర…
హరా హరా సదా శివా గంగాధర ఈశ్వరా…!!వ!!
పాహిమాం పాహిమాం పరమేశ్వర పాహిమాం.. రక్షమామ్ రక్షమాం.. గంగాధర రక్షమాం..