ఏడుకొండల వాడ వేంకటేశా….

ఏడుకొండల వాడ వేంకటేశా….
మూడు నామాల వాడ తిరుమలేశా…
వడ్డి కాసుల వాడ శ్రీనివాసా…
వేంగమాంబా ప్రియ చిద్విలాసా…
గోవింద గోవింద అని భక్తులనగా…
ఉజ్జయిని మారింది అల వైకుంఠ పురముగా…!!ఏడు!!

కేశవా…అందుకో మా ముడుపులు…
హే మాధవా…చెల్లించుకో మా మ్రొక్కులు…
అలమేలు మంగపతీ…చాలకున్నది దర్శనం…
పద్మావతీ పతీ…తీరకున్నది ఆశయం…
ప్రశ్నార్థకము అయినది సంతృప్తి దర్శనం…
బహు అపూరూపమౌతోంది ఆనంద వీక్షణం…!!ఏడు!!

నారాయణా… అనుచు కొండలెక్కాము…
మధుసూదనా…అనుచు మనసు నిలిపాము…
కస్తూరి తిలకమును నుదుట దిద్దాము…
కనకాది కానుకలు హుండీ లో వేశాము…
గరుడ వాహనము తాకి పుణ్యమొందాము…
నీ గరుడ సేవను చూసి ధన్యులయ్యాము…!!ఏడు!!

పాహిమాం…పాహిమాం… శ్రీహరీ పాహిమాం…రక్ష మాం…రక్ష మాం…వైకుంఠ వాసా రక్ష మాం…

Leave a Comment

Scroll to Top