కలువ మాలలలోన కాశీపతి…
కలలు పండించనున్నాడు గౌరీపతి…
అడగ తరుణమిది శంకరుని ఏదేని వరము….
కోర తగు సమయమిది ఈశ్వరుని ఇమ్మనుచు మోక్షము…!!క!!
వేదనలు తొలగు వేడుకొనినా…
భక్తి భావనలు పెరుగు స్తుతియించిన….
రోదనలు కనుమరుగు ప్రార్ధించిన…
శక్తి సామర్థ్యములు కలుగు కీర్తించిన…
ఆలసించక అభిషేకము చేయరారండి….
జాగు సేయక జంగముని కొలవ రారండి….!! క!!
ఒకసారి పలుకు ఓంకారం మంత్రం…
శివుని పాదాలు విడలేవు నీవు ఎంత మాత్రం…
పూజించి చూడు హరుని నామ మాత్రం…
అతడు దీవించి ఇచ్చేను బిల్వపత్రం….
దొరకునా ఇటువంటి వరము మనకు…
ముక్కంటి ఉన్నాడు సిద్ధంగ ఇవ్వ మనకు….!! క!!
పాహిమాం పాహిమాం పరమేశ్వర… రక్షమాం రక్షమాం సర్వేశ్వర…