కుంకుమ చందన లేపనం…
పంకజ హార సుశోభితం…
హే గంగాధర నీ దర్శనం…
తిలకించిన జన్మలు పావనం…
శంభో శంకర మహ దేవా…
హే సాంబ సదా శివ గురుదేవా…!!కుంకుమ!!
ఆ మల్లెల మాలల ధారణం…
భక్తుల మనసున వెన్నెల తోరణం…
ఎరుపద్దిన నీ ముఖ బింబం…
కనినంతనే పాపం భస్మం…
ఇది సత్యం శంభో శంకరా….
జగమెరిగిన నిజమిది శుభకరా…!!కుంకుమ!!
వినిపిస్తే దీనుని వేదన పిలుపు….
చప్పున స్పృశియించెదవు తన మది తలుపు…
ఆ భక్తుని గుండెకు తగిలిన గాయం…
నీ చల్లని స్పర్శకు మటు మాయం…
ఇది అక్షర సత్యం శంకరా….
మా మనసే సాక్ష్యం ఈశ్వరా…!!కుంకుమ!!
పాహి పాహి పరమేశా…మాం పాహి పాహి జగదీశా…
రక్షా రక్ష సర్వేశా…శివ రక్షా రక్ష గౌరీశా….