హరి హరుల దర్శనం ఆనంద దాయకం….

ఓం నమః శివాయ నమః 

హరి హరుల దర్శనం ఆనంద దాయకం….
శివకేశవుల వీక్షణం శుభదాయకం…
ఆహా…ఎంత భాగ్యమీ కనులకు…
మహేశ్వరునిలో వేంకటేశ్వరుని గాంచిన ఈ జన్మకు…!!హరి!!

చెప్పలేనట్టి అనుభూతి ఇది పరమాత్ములారా…
వర్ణించనలవి కానట్టి దృశ్యమిది మహితాత్ములారా….
పుణ్యాత్ములకు దొరకునది ఈ దర్శనం…
మాకిచ్చి చేశారు…మా జన్మ పావనం…!!హరి!!

తిరు వేంకటాధీశా..కానవయ్య..
కార్తీక మాసమిది త్రినేత్రునితో కలిసి దీవెనలు ఇవ్వరయ్య….
వడ్డి కాసుల వాడు వరములియ్యంగ….
కైలాస వాసా నీవు కరుణ చూపంగా…
ఎట్టకేలకు మాకు కలుగు మోక్షంబు…
నీకు అభిషేకములు చేయ తెస్తుమయ్యా భక్తితో ఒక గంగ చెంబు…!!హరి!!

పాహిమాం…పాహిమాం..శేషాద్రి వాసా…పాహిమాం…
రక్షమాం…రక్షమాం… కైలాస వాసా రక్ష మాం…

Leave a Comment

Scroll to Top