రుద్రాంశ సంభూత మారుతీ….

ఓం నమః శివాయ నమః 

రుద్రాంశ సంభూత మారుతీ….
కొనియడెనయ్య నిను రఘుపతి…
అందుకొనమని తన దివ్య మంగళ హారతి…
వరమునిచ్చాడయ్య నేడు…నీకు కైలాస గిరి పశుపతి….
భక్తాంజనేయా నమో నమామి…
వీరాంజనేయా సదా స్మరామి.,!!రుద్రాంశ!!

అసురులను ఆట పట్టించావు ఆ..లంకలో ..
సీతమ్మ కన్నీరు తుడిచి అశోకవనములో….
ఆ తల్లి ముదమార నిను మెచ్చుకొనగా…
ప్రణమిల్లి పోయావు సేవకునిగ దివి మెచ్చుకొనగ…
రామదూతవై రామాయణము కే వన్నె తెచ్చావు…
నిత్య రామ నామ పారాయణము చేయు రామ భక్తునిగా భువిన మెచ్చావు…!!రుద్రాంశ!!

అంజనీ సుతునివై అలరారు నీవు…
అయోధ్యా రాముని పద సన్నిధిన స్థానమొందావు…
నిను విడిచి ఉండలేనట్లు ఆ రామచంద్రుడు…
కరుణించి వరమిచ్చే కోదండ రాముడు….
భక్తాగ్రేసరునిగా వెలుగొందమంటు…
చిరంజీవి వై కలకాలము  వర్ధిల్లమంటు…
ఆశీస్సులందించె జానకీ రాముడు…
మదిన స్థానమిచ్చి దీవించె కౌసల్య  తనయుడు…!!రుద్రాంశ!!
పాహిమాం…పాహిమాం…శ్రీ ఆంజనేయ పాహిమాం…
రక్షమాం…రక్షమాం.. రుద్రాంజనేయ
రక్షమాం..

Leave a Comment

Scroll to Top