భస్మాభిషేక ప్రియ శివ లింగమా..

ఓమ్ నమ: శ్శివాయ నమ:🙏🏼🙏🏼🙏🏼

భస్మాభిషేక ప్రియ శివ లింగమా..
ఈ భక్తులను కనరారా ఓ జంగమా..
సకల ప్రాణికోటి ఆత్మ లింగమా…
మా పాపాలను దిగమింగి మము బ్రోవుమా..

పూదండలో దాగిన దారము లాగా..
దాగుందయా శివా..మాలోన భక్తి ఓ మూలగా…
వెలికి తీసెము పాలలో వెన్నలాగా…
భక్తి పారవశ్యముతో అభిషేకింతుము చిత్తడి నయనాల చినుకులతో నెయ్యిలాగా…!!భస్మా!!

చూస్తేను చాలురా ఓసారి ఎర్రనీ నీ బొట్టు కేసి…
కురిపించదా మాకు పుణ్యాల రాశి…
కీర్తిస్తే ప్రతిదినము మనసారా నిను చూసి…
మెలిక  మీసాల సాంబయ్యా…సంతసించవా మా భక్తికి మురిసి….

పాహిమామ్..పాహిమామ్..పరమేశ్వరాయా పాహిమామ్…
రక్షమామ్..రక్షమామ్..సర్వేశ్వరాయా రక్షమామ్…

Leave a Comment

Scroll to Top