ఎవరైన అనగలరా…మహా సుందరమూర్తిని చూడ చాలు రెండు కళ్లు మనకని….

ఓంనమఃశ్శివాయ నమః

ఎవరైన అనగలరా…మహా సుందరమూర్తిని చూడ చాలు రెండు కళ్లు మనకని….
ఇంకెవరైన అనగలరా…
ఆ కారుణ్యమూర్తిని చూస్తూ మన కాళ్లు ముందుకు కదలి పోగలవనీ..
చిరుమందహాసాల సంకెళ్ళతో బందీగ చేసేడు మనని…
అరవింద నేత్రాల ఆకళ్లతో ఆకట్టుకుంటాడు మనని…
మాటపెగలనియ్యడు శివుడు…
అడుగుపడనియ్యడు హరుడు…
బొమ్మలై పోతాము ముగ్ధులై మన మందరం…
తోలు బొమ్మలే కదా తన చేతిలో తుదకు మనమందరం…
సాగిలపడి వేడేము సాంబశివమూర్తిని..
తన దివ్య సౌందర్యమును చూచు భాగ్యము మన కళ్ళకిచ్చిన ధన్యమూర్తిని….

పాహిమాం…పాహిమాం..శంకరా..
రక్షమాం..రక్షమాం..శివశంకరా…

Leave a Comment

Scroll to Top