శివమూర్తికి చేద్దాము శిరసాభివందనం..

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

శివమూర్తికి చేద్దాము శిరసాభివందనం..
మన ఉమాపతికి చేద్దాము పాదాభివందనం….
హిమగిరి దొర గారికి పూస్తాము చందనం..
మనసెరిగిన స్వామికి చేద్దాము పద కీర్తనల నివేదనం…
రాగమయం..నాదమయం..యోగమయం..శంకరం..
కరుణమయం..ప్రేమమయం..శాంతిమయం..శంకరం…!!శివ!!

పాలు తేనే పాయసాలు ఫలములుంచి స్వామికి,
గుండు విరి మల్లెల దండలని సమర్పించి శివునికి…
భావ యుక్త రాగమున సదా శివుని కొలిచి…
సమాయత్తమవుదాము ధర్మాన నడవగా మనం నడుం బిగించి…
ప్రీతిమయం..ప్రాణమయం…యోగమయం..శంకరం..
ధ్యానమయం..విశ్వమయం..సర్వమయం…శంకరం..!!శివ!!

ఆసేతు హిమాచలం..శివోహం..శివోహం
కన్యాకుమారి పదం భజేహం..భజేహం..
ధన్యోస్మి శివా..నీ శివానంద గానలహరి రూపకం…
అదే శివా..అదే శివా…ఈ జగతికి యుగ యుగాల జ్ఞాపకం..
స్నేహమయం..దయామయం..రూపమయం..శంకరం…
విష్ణు మయం.. బ్రహ్మమయం..త్రిమూర్తిమయం..శంకరం…!!శివ!!

పాహిమాం…పాహిమాం..శివశంకర పాహిమాం..
రక్షమాం..రక్షమాం…అభయంకరా రక్షమాం..

Leave a Comment

Scroll to Top