సర్వ వ్యాప్తివి నీవు…సకల ప్రాప్తిని ఇచ్చేవు నీవు…

ఓం నమః శివాయ నమః 

సర్వ వ్యాప్తివి నీవు…సకల ప్రాప్తిని ఇచ్చేవు నీవు…
సర్వమూ నీవేను శంకరా….మాకన్ని యూ నేవేను శశిధరా…
ఈ జన్మ నీదేను భవహరా ..
మరుజన్మ ఇంకేల హర హరా…!!సర్వ!!

కొలిచేము నిన్ను కొండంత ఆశతో….
తలచేము నిన్ను పరిపూర్ణ భక్తితో….
చేయూత నందించు శంకరా….
పూలొంచి నిలిచాము ముందరా…
నీ పద పూజ చేసాము శుభకరా….
ఇక కరుణించ జాగేల ఈశ్వరా…!!సర్వ!!

ఆనంద భరితము నీ నామ
పఠనము….
అరుదైన ప్రవచనము..నీ పుణ్య చరితము….
పలికితే చాలు తొలగు కర్మములు..
విని తరించితే చాలు కలుగు మోక్షములు…
ఆద్యంత రహితా ఆదుకొన రారా…….
 ఉరగేంద్ర భూషా చేయందుకొన రారా…!!సర్వ!!

పాహిమాం….పాహిమాం…పరమేశ్వరా…
రక్షమాం…రక్షమాం..సర్వేశ్వరా రక్ష మాం…

Leave a Comment

Scroll to Top