ఒకసరి కనరా వరదాయకా…
మొరలను వినరా శివా కడదాకా..
ఎవరున్నారని శివా..మా ముందెనక..
ఇంకెవరిని అడగము శివా..నిను గాక..
చేతులు జోడించి దృష్టి సారించి చెప్పుకుంటున్నాము శివా నీకు వేదనలు..
మౌన ప్రార్ధనలు చేసి మనసు నీ వశము చేసి పంచుకుంటున్నాము శివా బాధలను…
తుడవరా శివా…నీ వేలితో మా కంటపొంగు కష్టాల కన్నీటినీ…
భుజము తడమరా శివా…ఉన్నానుగా మీ వెంట ఇంకెందుకంట గంగ మీ కంటనీ…
ధైర్యమిస్తే చాలురా శివా…ధర్మబద్దులై నడచుకుంటాము మేమందరం…
కనికరిస్తే చాలురా శివా..కర్మసిద్దాంతములనెరిగి యోగులై బ్రతుకు గడుపుతాము తుదకందరం…
నీ మది గెలిచి ఎగిరెయ్యమా వినువీధిన మా కలల విజయబావుటా..
రాబోవు తరములు అనుసరించి తరించగా ఇది భక్తి మార్గము తెలుపునట…