ఉత్తి పుణ్యానికే వరము లిత్తుడు శివుడు…

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

ఉత్తి పుణ్యానికే వరము లిత్తుడు శివుడు…
“శంభో హరా” అంటే పరుగులెత్తును హరుడు…
కోట్ల చందమామలు ఒక్కటైనా చాలునా ఆ ప్రేమమూర్తి రూపుకి..
పదికోట్ల కృతులైన చాలునా కీర్తించ దయాగుణ సౌందర్య శీలికి…!!ఉత్తి!!

బ్రహ్మ విష్ణాది దేవతలైనా బొమ్మలవవలసిందే నిన్ను తిలకించుతూ….
దివ్య సౌందర్య సొగసులను నీలోన కని స్థబ్దులవవలసిందే నిన్ను పరికించుతూ….
ప్రార్ధించేరు ఆపాదమస్తకం కురిపించమని నీ కరుణ చిరుచినుకులు భువి జనులపై…
అర్థించేరు…ఆ చంద్రతారార్కం పండించమని ఆనంద సిరుల పంటలు  అవనిపై…

పాహిమామ్..పాహిమామ్..శివశంకరా... పాహిమామ్..
రక్షమాం…రక్షమాం..అభయంకరా… రక్షమాం…

Leave a Comment

Scroll to Top