ఓం నమః శివాయ నమః
ఎర్రాని బొట్టుతో… ఎర్రేరని మాలతో..
కరుణించే కనులతో…దయచూపే మోముతో…
ఇచ్చావు దర్శనం…శివా ఇదే వందనం…
కొలిచినా అనుదినం..ఇదే మాకు శుభదినం…!!ఎర్రని!!
చందమామ లేని నింగి కానలేమయా…
నీ కరుణ లేని జన్మ..జన్మ కాదు శివయ్య…
కోటి తారలుండి వెన్నెలివ్వలేని నింగి నైతిని…
శతకోటి సిరులు వుండి నీ కరుణ లేని నిరుపేదనైతిని…
కోరనయ్యా శంకరా…కోటివరములిమ్మని..
అడగనయ్యా శంకరా…మరుజన్మ ఇవ్వు నాకని!! ఎఱ్ఱాని!!
ఈశా…నా మనమునందు నిలుపుకుంటిరా…
పరమేశా…రే పవలు నిన్ను నేను కొలుచుకుంటిరా…
ఒక వ్రతము మల్లె చేయని నీదు పాద సేవలు…
ద్విగుణీకృతముగ వెలుగగా తెలుప నీదు మహిమలు..
అలా నన్ను నేను నిలవనీ సాక్షినై…
ఇలా కరుణ చూపితే మారనా నందినై…!!ఎర్ర!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…
రక్షమాం…రక్షమాం…సర్వేశ్వరా రక్షమాం..