ఎందుకే తాకావు నా గుండెని..

ఎందుకే తాకావు నా గుండెని..
నీ మనసునెపుడు పిలవని నా మనసుని…
కదిలించి పోయావు ప్రేమ చిరుగంటలు…
ఎదలోన రగిలించి పోయావు తుదకు చితి మంటలు…!!ఎందుకే!!

మనసు మకరందాన్ని పంచివ్వనున్నట్లు…
నీ వలపు సంపదలు నా స్వంతమన్నట్లు…
ఆడుకున్నావు నా మనసుతో…
కలలు పెంచావు ఆశ కొలిపే కనులతో…
న్యాయమా చెలీ…న్యాయమా నన్నిలా వదిలేయుట…
భావ్యమా సఖీ..భావ్యమా నా మది తోటి ఆటాడుట….!!ఎందుకే!!

రా…ఈ గుండె గుడి దీపము ఆరిపోయెలోగా…
లే..లెమ్మంటు లేపు…నీ మదిని నామదితో భాషించగ…
బ్రతికించు నిజమైన ఈ ప్రేమ జీవిని…
రచియించు మనదిగా ఒక ప్రేమ చరితని…
ప్రతి పుటలలో కనిపించని మన అనురాగము ..
ప్రతి పూట చదవాలనిపించేంతలా మన మధుర కావ్యము… !!ఎందుకే!!

Leave a Comment

Scroll to Top