గజముఖ వదనా..శ్రీ గౌరీ శంకర…
పార్వతి ప్రియ సుత రూప జయ శివశంకర…
అభయములియ్యవయా అధినాయకుడా…
శుభములనియ్యవయా విఘ్నవినాయకుడా…
శివ శివ శంకర జై..జై…జై..
శివ శంకర గణపతి జై..జై..జై…
కన్నులు చిన్నవిగా ఉన్నా..ఓ గణేశన్నా…
మా కలతలు మరిచే చూపులు నీవన్నా..
మా వెతలను వినుటకు నీవన్నా…
నీ చాటెడు చెవులను చాచేవన్నా..
బానెడు కడుపున దాచుకొన మా ఖర్మలని…
అరిగెంచుకొన అడిగేవు మమ్మే ఇమ్మని కుడుములని…
దయగల దీన దాయాళుని వారసుడా…
ఉమా మహేశ్వరుల ప్రియతమ బాలుడా…
అందుకోవయ్య…గణనాధా పూర్ణాలు,బొబ్బట్ల మా వంటకాలు…
పండించవయా…శైలపుత్రా మా జీవితాల ఏపుగా నీ దీవెనల పంటచేలు…
ఓం గం గణపతియే నమః ఓం గం గణపతి యే నమః