ఓం నమః శివాయ నమః
అత్యంత సుందరం శంకరా..నీ దివ్య సౌందర్యం…
కనిన జనులెల్లరికి కలుగు సిరుల సౌభాగ్యం…
చిత్తరువులవుదురు నిను గాంచినాక….
క్షణములో… వారెవరొ వారికే తెలియదు తరియించినాక…
మాయలోడివయ్య మహేశ్వర…
నీ మాయలో పడిన వాడెవ్వడూ బయటపడలేడయ్య జగదీశ్వర…!!అత్యంత!!
ఉండి పోగలరందరూ నీ ఎదుటనే మోకరిల్లి…
కలలు పండితే చాలందురు… భక్తితో పద కవితలల్లి….
కలగనని స్వప్నము నేడు సాకారమైనటుల…
కనులముందే
సాక్షాత్కరించినట్లున్న శంకరా…నిను విడిచి వెళ్లు టెటుల….
దీవించరా శంకరా…మా హృదయా న నిరతమూ జీవించరా శంకరా…!!అత్యంత!!
పూటకొక పాటగా నీ భక్తి గీతము వ్రాయాలని….
అది ఘడియ కొక గీతమై నా నోట పలకాలనీ..
ఆర్తితో నిను వేడుకొంటోంది ఈ దేహము…
సేవించ శక్తి నిస్తే చాలు…చేరుకో వాలని ఉంది నీ మనసు తీరము…
కరుణించరా శంకరా…మా కనుల నివేదనల జల నిధులను గాంచి చలియించరా శంకరా…!!అత్యంత!!
పాహిమాం….పాహిమాం.. పరమేశ్వరా….పాహిమాం…
రక్ష మాం…రక్ష మాం…సర్వేశ్వరా రక్ష మాం….!!అత్యంత!!