పరుగు పరుగున వచ్చాను శంకరా…నిను కానగా….

ఓం నమః శివాయ నమః 

పరుగు పరుగున వచ్చాను శంకరా…నిను కానగా….
పది క్షణముla లైనా  paatu దర్శించుకొన నిను భక్తిగా….
భక్త జన సంద్రమైన నీ గుడి ప్రాంగణము చూసినాక…
క్షణము చాలనిపించే నిను కాన ఆనందమున నా కనులు తడిసినాక..!!పరుగు!!

తండోప తండాలుగా వచ్చారయా భక్తులు ఎందరెందరో….
తపసు చేయాలనిపించేంత నీ సౌందర్యమును చూడ ఎవ్వరెవ్వరో…
పట్టి లాగే స్తుంటే బంధాలు ఒక్కొక్కటి…
నేనెటుల లీన మవగలను నీ సేవలో  చెప్పరా ముక్కంటి…
ఆర్తిగా వున్నాను పరమేశ్వరా….
ఆర్ద్ర హృదయ నివేదనలను వినవయ్య విశ్వేశ్వరా…!!పరుగు!!

తప్పక కరుణిస్తావని నమ్మకము లోనున్నది…
తాపసిని కాకున్న దయచూపేవని నా మనసు చెబుతున్నది…
మనసు నీదే కాన..నా కలలు పండునేమో…
ఈ దేహమూ నీ భిక్షే కాన… తరియింతునేమో….
ఆశగా వున్నాను..పరమేశ్వరా….
ఆర్ద్ర నయనాల కన్నీటి ధారలను కని కరుణించరా…!!పరుగు!!

పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా...పాహిమాం
రక్షమాం…రక్షమాం…సర్వేశ్వరా రక్ష మాం…

Leave a Comment

Scroll to Top