మౌనమా? లేక ధ్యానమా…

ఓమ్ నమ:శివాయ నమ:🙏🙏🙏

మౌనమా? లేక ధ్యానమా…
చెప్పరా జంగమా…
శంకరా…మా ప్రాణమా…
పలుక కుండుట న్యాయమా?


కష్ట సుఖములు పంచుకొనుటకు
కదిలితిమయా నీ చెంతకు…
మంచి,చెడ్డలు చెప్పుకొనుటకు వస్తిమయ్యా నీ ముందుకు…
కళ్ళు తెరిచి కానరా శివా…ఒక్కసారి మమ్ముల…
మాకళ్ళు రాల్చును చూడరా ఆనంద భాష్పములు జల జల…

కనిపించరా శివా..చనుబాలు తాగి కడుపునిండిన చంటి బిడ్డడి నవ్వువై…
ఉదయించరా శివా… ఆ లేత భానుని కిరణములకు విచ్చుకొన్న  పువ్వువై…
అందమైన సృష్టి నిచ్చిన ఆది దేవుడివి నువ్వురా…
మాకందనంత గ దూరమైతే మనగలగునెట్లురా…మా మనుగడెట్లురా..
అవతరించవేళాయరా శివా… అవని పైన మరో పేరున…
ఉద్భవించి సాగనంపు సంహరించి శాశ్వితముగా లేకుండా మహమ్మారి కరోనా…

పాహిమామ్..పాహిమామ్..శివ శంకరయా పాహిమామ్…
రక్షమామ్…రక్షమామ్..ఉగ్ర రూప మహకళాయ రక్షమామ్…

Leave a Comment

Scroll to Top