కరుణించినావా కైలాస మూర్తీ…

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

కరుణించినావా కైలాస మూర్తీ…
కలలు పండించినావా కారుణ్యమూర్తీ…
దివ్య సౌందర్యము వెలుగొందు ఓ చిన్ని చిరునగవుతో…
వెండి వెన్నెలలు పూయించు ఆ నీలి నయనాలతో…
సర్వవేళలా తోడు నేనుంటాననంటూ సాక్షాత్కరించి..
ఏ వేళనైన ఆనందముగ మేముంటే చాలంటూ దరహాసములు పంచి..!!కరుణి!!

తాపసులు ఎన్నెన్ని తపములను చేసినా…
ముని జనులు ఎన్నెన్ని జపములను   చేసినా…
దర్శించుకొన లేని నీ దివ్య మంగళ రూపాన్ని…
కన్నామయా శ్రీ కాళలింగమున నీ ప్రేమ స్వరూపాన్ని…
పరుగెడుతూ దివి నుండి బ్రహ్మవిష్ణాది దేవతలు భువికి దిగి  వచ్చురేమో….
ఉజ్జయిని వీడి కైలాసమునకు రమ్మంటూ నిను తోడ్కోని పోవుదురేమో….!!కరుణి!!

పిలిపించుకోవయ్య వెంటనే పార్వతీసుత సమేత పరివారమంతటిని…
కోరి తెప్పించుకోవయ్య హిమనగర గిరి సిరుల సంపదలనన్నిటినీ..
ఆవిష్కరించవయా…అవనిపై ఇంకొక్క కైలాసము…
అనుగ్రహించవయా..తీర్చంగ నీ భక్తుల మనోభావము…!!కరుణి!!

పాహిమామ్..పాహిమామ్..శివశంకరా.. పాహిమామ్..
రక్షమాం..రక్షమాం..అభయంకరా.. రక్షమాం..

Leave a Comment

Scroll to Top