ఓం నమః శివాయ నమః
నాగేశ్వరం నమామి …
నాగ చంద్రేశ్వరం స్మరామి…
కనులు..పండుగను చేసుకొనెనయ్య శంకరా..నిను గాంచి ఈ ఘడియన…
ఒడలు పులకించి పోయేనయ్య భక్తితో నిలువెల్ల ఈ క్షణాన…!!నాగే!!
ఎన్ని సొబగులు అద్దితే నీకు సరిపోవు శంకరా….
నీ సహజ సౌందర్యమునకు అవి అడ్డురా హరహర…
మనసాపుకొనలేక చేసేము ఈ సొగసులు…
తనివి తీరా నిను చూసుకోవాలన్న తపనతో మా మనసులు….
కలడందువా శంకరా… ఎవరైన ఈ భూమిపైన…
విశ్వమోహనమైన నీ రూపమును వర్ణించి వ్రాయగల పండితుడు ఒక్కడైనా…!!నాగే!!
ఒకసారి నీ నుండి నీవు వెలికి రావయ్య…
ఎదుట నిలుచు కొని తేరిపారా నిను నీవు చూసుకొనవయ్య….
అనగలవు మా మాట సత్యమని…
మెచ్చి…ఇవ్వగలవు కోరుకొమ్మంటూ ఏదేని వరముని …
వరములేలయ్య మాకు వరదాయక…
సుస్వరముగ నీ నామమును పలుక.. శక్తినిస్తే చాలు శుభదాయకా…!!నాగేశ్వర!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం….
రక్షమాం…రక్షమాం…సర్వేశ్వరా రక్ష మాం…