ఈశ్వరా….పరమేశ్వరా…

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

ఈశ్వరా….పరమేశ్వరా…
ఏనాటి ఋణమిదో చెప్పరా…
ఈ జన్మకైన నను తీర్చనివ్వరా…
మరుజన్మ దాక ఉంచబోకురా…!!ఈశ్వరా!!

మనిషినై పుట్టాక…
మమతానురాగాలు పంచాక..
పెనవేసుకున్నాయి విడలేని అనురాగబంధాలు…
నేను..నేను కాదనే నిజము తెలిశాక..
నాకు నేనే..నేనెవరనే ప్రశ్న వేసుకున్నాక….
కనిపించే నా చుట్టూ శూన్య వలయాలు..!!ఈశ్వరా!!

తుదకు నా తోడు నీవనే తెలిసి…
కడవరకు నీనీడనే నా మనుగడని తెలిసి…
గుడి గడప దాటి లోనికి వచ్చానయా…
నీ పాదాలపై పడి వేడుకొనగ వచ్చానయా..
కానవయ్య శంకరా…కరుణించవయ్య  శంకరా….
వినవయ్య శంకరా…మది విన్నపములను వినవయ్య శంకరా…

పాహిమామ్..పాహిమామ్..శివశంకరా పాహిమామ్..
రక్షమామ్..రక్షమామ్..అభయంకరా రక్షమామ్..

Leave a Comment

Scroll to Top