తీక్షణ వీక్షణముల్ తగునటయ్య శంకరా…మా పైన..

ఓం నమః శివాయ నమః

తీక్షణ వీక్షణముల్ తగునటయ్య శంకరా…మా పైన..
తక్షణము ఉపసంహరించు కొని నీ కరుణ కనులతో తిలకించవయ్య త్రినయనా…
అవని అల్లాడి పోదా…పరమేశ్వరా..
జగతి కల్లోల మవదా…జగదీశ్వరా..
శాంతించరా శంకరా…
సుఖ శాంతులను ప్రసాదించరా…శంకరా…!!తీక్షణ!!

అల్పులము మేము..ఆగ్రహించకయ్యా…
పరిపూర్ణ భక్తులగుటకు అనుగ్రహించవయ్య…
శిరమొంచి మ్రొక్కెదము నీ పాదాలపై బడి…
వరమొంది చేసేదము…మా గుండెనే నీ గుడి…
శాంతించరా..శంకరా…
ప్రశాంతముగా సాక్షాత్కరించరా శంకరా….!!తీక్షణ!!

పట్టు వస్త్రములను కానుకలుగ అర్పించి….
తీపి ఫలముల నైవేద్యముల నుంచి..
మారేడు దళములను ముదముగా వేసి…
బంతి చేమంతులను దండలుగ వేసి..
శాంతించిమని కోరేము నీ దివ్య స్తోత్రాలతో….
ప్రసన్నుడివి కమ్మని ప్రార్థించేము..సుమధుర సంగీత నీ భక్తి గీతాలతో…!!తీక్షణ!!

పాహిమాం….పాహిమాం…పరమేశ్వరా…పాహిమాం…
రక్షమాం…రక్షమాం..సర్వేశ్వరా రక్ష మాం…

Leave a Comment

Scroll to Top