కీర్తించనా శివా…కీర్తించనా…

ఓం
నమ:శ్శివాయనమ:🙏🏼🙏🏼🙏🏼

కీర్తించనా శివా…కీర్తించనా…
పద కవితలల్లి వచన కావ్యములతో నిన్ను సేవించనా…
నీ పాదాల ప్రణమిల్లి అక్షరాక్షతలతో నిన్ను పూజించనా…

సాహితీ పూదోట వనమాలినై…
నీ దివ్య సౌందర్యమును విర చించగా…
కోసుకోనా నేను ఒక్కొక్క పుష్పాక్షరమును….
సమకూర్చుకొని రాయనా నేను కవినై
నీ ఆంతర్యమును తెలుపగా
సృష్టించి నా భాష లో ఓ కొత్త వేదమును…
తెలుసురా శివా… ఆకాశమంత మనసు నీదనీ…
దయతలచి ఇవ్వరా శివా…ఓ చిన్ని అవకాశము నాకనీ…
నాలోన నేను రాసేసుకుంటూ…
మదిలోన నిన్ను ఊహించుకుంటూ..
చూడనీ శివా…నన్ను ఆ అద్వైత తీరాలని…
నన్ను తెరవనీ శివా…. నీ మనసు ద్వారాలనీ

పాహిమాం…పాహిమాం..శివశంకరా పాహిమాం…
రక్షమాం…రక్షమాం..పరమేశ్వరా రక్షమాం..

Leave a Comment

Scroll to Top