ఓం నమః శివాయ నమః
మారాజువయ్య గణ నాయకా…
మా మంచి మనసున్న రాజువయ్య ప్రియ పాలకా….
ప్రమద గణ బృందానికి అధిపతివి గా….
అగ్రపూజార్హత పొందిన గణపతివిగా..
ఏలుతున్నావయ్య
హస్తినయనామృత సుందరా…
మా మదిని పాలించుచున్నావయ్య లలిత మనస్విత లంబోదరా…!!మా!!
కారణ జన్ముడవు నీవు కాత్యాయిని నందనా….
లోక కల్యాణం కొరకు ఉద్భవించిన పార్వతీ పరమేశ్వరుల ప్రాణమే నీవు గజానన…
కనిపించదయ్య నీ రూపమే లేని ఏ ఇల్లు ఈ పుడమిలో…
వినిపించునయ్య నీ శ్లోకమే మొదటగా ప్రతి ఇంట జరుగు శుభ కార్యాల సమయాలలో ..
ముద్ద పసుపులో నిను తలచుకొని వేడుకొంటాము…
అర్ధమగు రీతిలో ఆర్తిగా కొలుచుకునుచుంటాము…!!మా!!
ఇంటింటా వెలసి ఇష్టదైవమయ్యావు…
చంటి పాపలకు కూడా నువ్వెంతో దగ్గరయ్యావు….
చుట్టమై వస్తావు భాద్రపద మాసాన చవితి పూట….
విడలేని బంధాలు వేసి వెళ్ళిపోతా వు ఎందుకట…
సాగనంపాలంటే మనసాగదు నేనేమీ చెయ్య….
నిన్ను నిమజ్జనము చేస్తుంటే ఆగకుంది కన్నీరు.. ఎటుల చెప్పు గణపయ్య….!! మా!!
పాహిమాం…పాహిమాం..గజానన…
రక్ష మాం…రక్ష మాం…గౌరీ ప్రియ నందనా…