త్రిశూల తిలకాంకృత త్రినేత్రుడా…

ఓం నమః శివాయ నమః

త్రిశూల తిలకాంకృత త్రినేత్రుడా…
త్రిలోక పరిపాలక పరమాత్ముడా…
కనగ రావయ్య..కైలాస గిరి తరుల నొదిలి….
మా వెతలను వినగ రావయ్య చూపించ మా పైన జాలి…
దయాకరునివై…దయ చేయ వయ్య..
కరుణాకరునివై కరుణించ రావయ్య..!!త్రిశూల!!

కష్టసుఖములన్నిటిని
చెప్పుకోవాలనిపించు కారుణ్య రూపుడా…
చిత్త శుద్ధితో కొలిచితే చిటికెలో కడతేర్చు చంద్రశేఖరుడా..
భక్తులను బ్రోవంగ కాళేశ్వరునివై ఈ నేల పై వెలిసినావు…
అశక్తులను కావంగ సర్వేశ్వరునివై  విశ్వమంతయూ వ్యాపించి వున్నావు…
నమక చమకములతో ప్రార్థించు చున్నాము…
నువున్నావన్న నమ్మకముతో జీవించుచున్నాము…!!త్రిశూల!!

నిట్టూర్పులే ఉపిరై
బ్రతుకుతున్నారెందరెందరో..
నీ కరుణకై ఆశగా వేచి వున్నారు ఇంకెందరో…
ఉదయించవా శంకరా…ఉషస్సువై మా జీవితాలలో….
వెలిగించవా నీ జ్ఞానజ్యోతి… మా హృదయ మందిరములలో…
చిగురించనీ నీ ధ్యాసలో సరికొత్తగా మా జీవితం…
వెలుగొందనీ నీ తేజమై కీర్తించగా నీ చరితము…!!త్రిశూల!!

పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా...పాహిమాం…
రక్షమాం…రక్షమాం..సర్వేశ్వరా రక్ష మాం…

Leave a Comment

Scroll to Top