ఓమ్ నమ:శ్శివాయ నమ:


రాజువయ్యా…మా రాజువయ్యా..
కరుణ సామ్రాజ్య నెలరాజువయ్యా..
దొరవు నీవయ్య…మా దొరవు నీవయ్య…
హిమనగపు నగర వెన్నెలవు నీవయ్య…
నీ ప్రేమ పరిపాలనా జలధిలో…
మునిగినా చాలయ్య క్షణకాల వ్యవధిలో…
పాలించవయ్యా శంకరా…ప్రేమతో..
పరిపాలించరా హర హరా…చిరునగవుతో…!!రాజు!!
కరువు,కాటకములు తెలియని లోకమై…
ఏ కన్నీటి వేదనలు వినిపించని విశ్వమై…
పాలించవయ్యా…పరిమళించే నీ ప్రేమ బంధాల సుగంధాలను పంచుతూ…
సాగించవయ్యా పాలనను..
ప్రతి ప్రాణి హృదయమున పాలకునివై ప్రకాశించుతూ…!!రాజు!!
పాహిమామ్..పాహిమామ్..పార్వతీ ప్రియ వదనాయా పాహిమామ్..
రక్షమాం..రక్షమాం..గౌరీ హృదయ నిలయాయ…రక్షమాం..