గౌరీ ప్రియ నందనా…శ్రీ గజాననా..

ఓం నమః శివాయ నమః 

గౌరీ ప్రియ నందనా…శ్రీ గజాననా..
తొలి పూజల దైవమా ..ఎలుక వాహనా…
కావుమయ్యా గణపతి కంటి రెప్పలా….
మా తోడు నీడ నీవే మాకన్నివేళలా…
గణ నాయక.. శుభదాయక.. వరదాయక గణేశా…
నిను తలచిన ప్రతి కార్యము శుభమే కదా గణేశా…!!గౌరీ!!

మరువమయ్య మహాకాయా ఎంత మాత్రము..
మరువనియ్యదయ్య నీ చూపుల సూక్ష్మ నేత్రము…
చెలిమి పంచి చేరదీయు నీదు మానసం….
అది నిక్కముగా చేసుకొనె మా గుండె నివాసం…!!గౌరీ!!

గౌరీ మానసమందు వెలుగులీను గణపతి…
శంభో శంకరుని ప్రేమ పొందినట్టి గణపతి….
చుట్టమల్లె నిన్ను మేము చేరదీతుము…
గొడుగు పట్టి కాళ్ళు కడిగి ఆదరింతుము…
వంటకాల ఘుమ ఘుమ లతో స్వాగతింతుము….
కడుపారా ఆరగించి ఆదరించ వేడుకొందము…!!గౌరీ!!

పాహిమాం…పాహిమాం..పార్వతీ తనయా….
రక్షమాం..రక్షమాం..పరమేశ్వరి హృదయా….

Leave a Comment

Scroll to Top