హైమావతి సుందరా…
శంకరా…కాత్యాయనీ దొరవరా…
తెచ్చాను వింజామర…
సేద తీరయ్య గంగాధరా…
పరవశము చెందితే నా సేవ పొంది…
శివా…అంతకన్నా నాకు భాగ్యమేముంది…!!హై!!
వరమియ్య వయ్యా నీ ఢమరుక మును మోసెద..
శలవియ్యవయ్యా త్రిశూలమును పెట్టెద…
కరుణించవయ్యా పాదము లు కడిగెదా…
దీవించవయ్యా నీ పీఠమును తుడిచెద…
నీ సేవలో అలుపు తెలియనివ్వవులే…
నిను తలచు కోకుండా మనసు నుండనివ్వవులే…!! హై!!
ఆమ్రఫలములు నైవేద్యముగా ఉంచినానయ్యా…
అరుదైన పుష్ప జాతుల విరులు అర్పించినానయా…
దీప జ్యోతులు నీకు వెలిగించినా నయా….
భస్మ హారతులతో నిన్ను కీర్తించినానయా….
ఎనలేని భక్తిని నా కొసగుమయ్యా…
ఎవ్వరూ కనలేని నీ రూపు నన్ను కననీవయ్యా…!! హై!!
పాహిమాం…పాహిమాం..పరమేశ్వరా పాహిమాం…
రక్ష మాం..రక్షమాం..సర్వేశ్వరా రక్షమాం….