విస్పోటనమౌ పాపాలు విశ్వేశ్వరుని తలచిన…

విస్పోటనమౌ పాపాలు విశ్వేశ్వరుని తలచిన…
కనుమరుగౌ కష్టాలు కాళేశ్వరుని కొలిచిన…
సుస్పష్టమౌ తన కరుణ శివుని ధ్యానించిన….
ప్రత్యక్షమౌ శంకరుడు మనసు నర్పించిన…
మనోనిష్ఠ గల వారితో తాను  ముచ్చటించు…
ఆత్మశుద్ధి గల వారిలో తాను ప్రవేశించు…!!వి!!

దయార్ద్రహృదయులను తన దరికి చేర్చుకొనును….
ప్రేమ మూర్తులను ప్రియమార హత్తుకొనును…
కష్ట జీవుల కన్నీరు తుడుచు వారన్నా…
నష్ట జాతకుల రాతలను మార్చువారన్నా….
ఎంతిష్టమో శంకరునికి చెప్పలేము…
వారిని కరుణించు తీరు ఎట్లుండునో ఊహించలేము…!! వి!!

భక్తి భావముతో దగ్గరవుతూ శంకరుని మదికి….
సేవా భావముతో చేరెదము కైలాస పురికి…
ముక్తి మార్గము బొంద ఈ జన్మకి…
దిక్కు ముక్కంటి ఒక్కడే ఏనాటికీ..
తపము చేయమని అడగని తండ్రి తాను…
తప్పక వరమివ్వలెనన్న తపనున్న త్రయంబకుడు తాను…!!వి!!

పాహిమాం…పాహిమాం..పరమేశ్వరా పాహిమాం…రక్షమాం..రక్షమాం..సర్వేశ్వరా రక్షమాం..

Leave a Comment

Scroll to Top