ముద్దు బాలుడమ్మా నీ గణపతి…

ముద్దు బాలుడమ్మా నీ గణపతి…
భలే మంచివాడు పార్వతీ మీ గణపతి…
పెట్టినంత చాలు తనకు కొన్ని కుడుములు…
మాకు ఇచ్చునమ్మ అతడు వే వేల వరములు…
!!ముద్దు!!

ఆటలాడ చేయి కలుపు గణపతి…
మాతో నాట్యమాడ కాలు కదుపు గణపతి…
నర్తిస్తే మాతోన నృత్య గణపతి….
నీకు అర్పిస్తము మా మనసే గణపతి….గణపతి…!!ము!!

నిన్ను కొలుచు భాగ్యమివ్వు గణపతి…
సదా నిన్ను తలచు యోగమివ్వు గణపతి…
మిన్ను విరిగి మీద పడ్డా గణపతి…
నీ చవితి పూజ ఆపమయా గణపతి….
గం గం గం గణేశా గౌరీ నందనా…
నీకు గజమాలలు వేస్తుమయా గజముఖ వదనా…!!ము!!

పాహిమాం పాహిమాం పాహి గణపతి… రక్షమాం రక్షమాం శివ రక్ష గణపతి…

Leave a Comment

Scroll to Top