ముక్కంటి ముక్కంటి నిను నేను కంటి…

ముక్కంటి ముక్కంటి నిను నేను కంటి…
మూడు పొద్దులు నేను శరణు శరణంటి…
నా కనుల కొలనులో నీరు కనమంటి…
ఆ నీటితో కాళ్లు కడగనిమ్మంటి…
శివ శివా..శంకర శివ శంకరా….
హర హరా…ఈశ్వర గంగాధర…!!ము!!

బంధాలు బాధ్యతలు బరువాయనయ్యా..
ప్రేమించు హృదయాలు కరువాయనయ్యా…
మోసాలు ద్వేషాలు పెల్లుబికెనయ్యా…
మంచి మనసులు ఇలన మాయమయనయ్య….
ఎటువైపు వెళుతుందో ఈ లోకము…
శివా… తెరిపించవా కనులు మా కోసము…!!ము!!

స్వార్ధాల సంస్కృతికి ఋజువైతిమి…
మోహాల మాయలకు బలి అయితిమి…
మనసు చెప్పిన మాట వినకుంటిమి…
ముళ్ల దారిన పడి బయట పడకుంటిమి..
పరమార్థమెరుగనివి మా జన్మలు…
తెరిపించు శంకరా మా కన్నులు…!!ము!!

పాహిమాం…పాహిమాం..పరమేశ్వరా...రక్షమాం…రక్షమాం…సర్వేశ్వరా…

Leave a Comment

Scroll to Top