ఫాలనేత్రా… ఆగ్రాణించవయ్యా సన్నజాజుల పరిమళాలు..

ఫాలనేత్రా… ఆగ్రాణించవయ్యా సన్నజాజుల పరిమళాలు…
నీలినేత్రా…ఆస్వాదించవయ్యా ఎండు ఫలముల నైవేద్య రుచులు..
పరమ పవిత్రమైన హృదయముతో అర్పించినారు…..
అత్యంత నియమ నిష్ఠలు చూపి సమర్పించినారు…
ప్రసున్నుడివి కావయ్య పరమేశ్వరా…
లోకాలు ప్రకాశముగా వెలుగొంద శివశంకరా…!! ఫా!!

అసమాన తేజో విరాజితా శివా ఆదిదేవా…
అనంత ప్రాణికోటీ పూజితా శివా మహాదేవా..
విశ్వమంతయూ నడిచేది నీ కనుసైగతో…
సృష్టి మొత్తమూ జరిగేది నీ కరుణా కటాక్షములతో..
కంఠాన గరళమును మింగి ఉన్నా…
జంగమా..మా పైన నీ ప్రేమ ఉప్పొంగు నన్నా…!! ఫా!!

ఆవాహనము చేసేము ఆవహించు…
అభిషేకములు చేసేము స్వాగతించు..
మనోరంజకముగా ప్రార్థింతుము కనికరించు…
నీ మనోభీష్టముగ దీవెనలను ప్రసాదించు…
నీ ఆజ్ఞ లేనిదే ఊపిరిని పీల్చగలమా…
నీవు కాదనినచో ఊపిరిని వదలగలమా….!! ఫా!!

అహిమాం పాహిమాం పరమేశ్వర పాహిమాం రక్షమాం..సర్వేశ్వరా రక్షమాం….

Leave a Comment

Scroll to Top